Hyderabad: సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌ను సీజ్‌ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించారు.

Updated : 18 Sep 2023 09:25 IST

హైదరాబాద్‌: అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించారు. ఈ హోటల్‌పై ఈ నెల 15న కొంత మంది ఫిర్యాదు చేయడంతో పాటు పలు దృశ్యాలు సామాజిక మాధ్యమంలో ప్రచారం కావడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. హోటల్‌ను పరిశీలించి కొన్ని శాంపిల్స్ సేకరించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట గది పరిసరాలను గుర్తించారు.

సేకరించిన ఈ శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. అయితే, ఆదివారం మరోమారు అధికారుల బృందం హోటల్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం లేదని, పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించారు. దీంతో తగిన పరిశుభ్రత చర్యలను తీసుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించింది. దీంతో తదుపరి చర్యల కోసం యాజమాన్యం హోటల్‌ను మూసివేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి హోటల్ యాజమాన్యానికి ఫెనాల్టీ విధిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు