
Ts News: ఉద్యోగుల డీఏ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు నిన్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన డీఏ 2021 జులై 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ ఉద్యోగులకు అందనుంది. 2021 జులై నుంచి బకాయిలు జీపీఎఫ్‌లో ప్రభుత్వం జమ చేయనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.