Kishan reddy: లండన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం
న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భాజపా - యూకే విభాగం ఆధ్వర్యంలో హీత్రూ విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం లభించింది..
లండన్: న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భాజపా - యూకే విభాగం ఆధ్వర్యంలో హీత్రూ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. గత 9 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను ఆయన వివరించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడం, వారికి సరైన గౌరవం లభించేలా మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను ఫ్రెండ్స్ ఆఫ్ భాజపా సభ్యులతో పంచుకున్నారు. అనంతరం పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ‘సంస్కృతి - సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్‌లెన్స్’ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’