Temparature: భానుడి ఉగ్రరూపం.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Updated : 14 May 2023 18:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. దీంతో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గరిష్ఠంగా 45.9 డిగ్రీలు, జన్నారంలో 45.8, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్‌ జిల్లా ముప్కల్‌లో 45.1, నల్గొండ జిల్లా పజ్జూరు లో 45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 44.8, ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లి(టీ)లో 44.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 44.8, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 44.8, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 44.7 డిగ్రీల మేరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల్లో 40 నుండి 42డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య దిశ నుంచి ఈ రోజు తెలంగాణలోకి దిగువస్థాయిలోని గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని