Acne Scars: మొటిమల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఏం చేయాలంటే...!

అందమైన మోము ఆపై చక్కని చిరునవ్వు అందరినీ మెప్పిస్తుంది. కుందనపు బొమ్మలా ఉన్నా మొహం మీద మొటిమలు బాధపెడుతుంటే ఎలా ఉంటుంది..? దాని తర్వాత ఏర్పడే మచ్చలతో నలుగురిలోకి వెళ్లాలంటే దడ పుడుతుంది. ఈ పరిస్థితి చాలా మంది యువతకు ఎదురవుతుంది. వైద్యుల వద్దకు వెళ్లకుండా ప్రచారంలో వచ్చిన మందులనో, క్రిములనో వాడి మరింత ఇబ్బందులను తెచ్చుకుంటారని వైద్యులు పేర్కొంటున్నారు.

Published : 16 Oct 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందమైన మోము ఆపై చక్కని చిరునవ్వు అందరినీ మెప్పిస్తుంది. కుందనపు బొమ్మలా ఉన్నా మొహం మీద మొటిమలు బాధపెడుతుంటే ఎలా ఉంటుంది..? దాని తర్వాత ఏర్పడే మచ్చలతో నలుగురిలోకి వెళ్లాలంటే దడ పుడుతుంది. ఈ పరిస్థితి చాలా మంది యువతకు ఎదురవుతుంది. వైద్యుల వద్దకు వెళ్లకుండా ప్రచారంలో వచ్చిన మందులనో, క్రిములనో వాడి మరింత ఇబ్బందులను తెచ్చుకుంటారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా యువతీయువకులు మొటిమలను గిల్ల కుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయని డెర్మటాలజిస్టు డాక్టర్‌ సందీప్‌ వివరించారు.

ఇది సహజమే...

పెద్దలు చెప్పినట్టు మొటిమలు వయసుతో వచ్చి వయసుతో పోతాయి. కానీ కొన్ని రకాల మొటిమలు మొహాన్ని అందవికారంగా చేస్తాయి. తెల్ల మొటిమలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నల్ల మొటిమలతో గడ్డలు ఏర్పడి, చీము పడుతుంది. ఆ తర్వాత మచ్చలు వస్తాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొటిమలు నాలుగు రకాలు..ఒకటి ఐస్‌పిక్‌, బాక్స్‌, రోలర్‌, హైపర్‌ ట్రోపిక్‌గా చెబుతాం. 

మచ్చలు పడితే ఎలా...?

ఈ గుంతలను 70 శాతం బాగు చేసుకోవడానికి వీలవుతుంది. క్రిములతో మచ్చలు తగ్గవు. కెమికల్‌ ఫీల్‌తో కొంతవరకు తగ్గించుకోవచ్చు. డెర్మ రోలర్‌, బ్రష్‌, లేజర్‌తో చాలా వరకు నివారించుకోవచ్చు. రెండు నెలల్లో చాలా వరకు తగ్గిపోతాయి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తినడంతో మొటిమలు రాకుండా పోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని