Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షోకాజ్‌ నోటీసులు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్‌ పోలీసులు రెండు షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు.

Updated : 07 Dec 2022 00:24 IST

హైదరాబాద్‌: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్‌ పోలీసులు రెండు షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రాజాసింగ్‌ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. చర్యలు ఎందుకు తీసుకోవద్దో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయోధ్య, అక్బర్‌ గురించి రాజాసింగ్‌ వేర్వేరుగా పోస్టులు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని