కేరళలో పాక్షికంగా తెరుచుకున్న పాఠశాలలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్‌లో మూతబడిన పాఠశాలలు కేరళలో నేడు పాక్షికంగా తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య 2 మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభమయ్యాయి...

Published : 01 Jan 2021 23:49 IST

తిరువనంతపురం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్‌లో మూతబడిన పాఠశాలలు కేరళలో నేడు పాక్షికంగా తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య 2 మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభమయ్యాయి. షిఫ్టుల వారీగా పరిమిత గంటల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని కేరళ సర్కారు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిమిత గంటల పాటు 10, 12 తరగతులకు నేడు క్లాసులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారి 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే తరగతులకు అనుమతించాలని పాఠశాల యాజమాన్యాలకు కేరళ సర్కారు సూచించింది. విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని పేర్కొంది.

ఇవీ చదవండి...

ఇదీ.. జనవరి 1 వెనకున్న కథ!

2020లో.. కరోనా మోసుకొచ్చిన కొత్త పదాలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని