KTR: వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు: కేటీఆర్‌

నగరంలో ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేటీఆర్‌ సమీక్షించారు.

Updated : 19 Jul 2023 20:42 IST

హైదరాబాద్: నగరంలో ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేటీఆర్‌ సమీక్షించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అన్ని శాఖల సమన్వయంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు కేటీఆర్‌కి తెలిపారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారుల్లో డీవాటరింగ్‌ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని.. అయితే, దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు