పుచ్చకాయకు ప్రత్యేక బ్యాగ్‌ ఎప్పుడైనా చూశారా!

పుస్తకాలు.. సరుకులు.. మహిళల కోసం మార్కెట్లో ఎన్నో రకాల బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. మోసుకెళ్లే వస్తువును బట్టి వివిధ ఆకృతుల్లో.. అనేక రంగుల్లో బ్యాగులు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ పుచ్చకాయ కోసం ప్రత్యేకంగా

Published : 21 Aug 2020 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుస్తకాలు, సరకులు, మహిళల కోసం మార్కెట్లో ఎన్నో రకాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మోసుకెళ్లే వస్తువును బట్టి వివిధ ఆకృతుల్లో.. అనేక రంగుల్లో బ్యాగులు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ పుచ్చకాయ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగ్‌ను ఎప్పుడైనా చూశారా? 

జపాన్‌కు చెందిన బ్యాగ్స్‌ డిజైనర్‌ సుషియా కాబన్‌ దీన్ని రూపొందించారు. యూసుకె కడొయ్‌ అనే క్రాఫ్ట్‌మెన్‌తో కలిసి ‘ది ఫన్‌ ఆఫ్ క్యారియంగ్‌’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క వస్తువునే మోసుకెళ్లే విధంగా బ్యాగ్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్క పుచ్చకాయ మాత్రమే పట్టే బ్యాగ్‌ను తయారు చేశారు. కడొయ్‌కి పుచ్చకాయలంటే చాలా ఇష్టమట. అందుకే దీనిని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఈ బ్యాగ్‌ కోసం ఇటలీ నుంచి తెప్పించిన లగ్జరీ లెదర్‌ను వాడరట. అయితే దీనికి మార్కెట్లో అమ్మకానికి పెట్టట్లేదు. కేవలం టోక్యోలోని షుబుయా, రొప్పొంగి ప్రాంతాల్లో ఉన్న సుషియా కాబన్‌కి చెందిన స్టోర్స్‌లో డిస్‌ప్లేగా పెడతారట. కొనలేకున్నా.. ఈ బ్యాగ్‌ను ఎలా తయారు చేశారో ఈ వీడియోలో చూసేయండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని