Ambati Rambabu: దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌.. కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు: మంత్రి అంబటి

డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బతిందని.. అయితే, కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.

Updated : 20 Jul 2023 17:11 IST

విజయవాడ: ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా మళ్లీ కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయించినట్లు  మంత్రి తెలిపారు. నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచనున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బతిందని.. అయితే, కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇవ్వలేదని మంత్రి అంబటి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని