KTR: 2023 మార్చి నాటికి ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలి: కేటీఆర్‌

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 13 May 2022 14:23 IST

హైదరాబాద్‌: వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై వెంగళరావునగర్‌లో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, అధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పపై దృష్టిసారించాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రక్రియ పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా పట్టణీకరణ జరుగుతుందని.. అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. పట్టణీకరణ నడుస్తున్న చరిత్ర అని.. ఎవరు ఆపినా అది ఆగదన్నారు. ఈనెల 20 నుంచి జూన్‌ 5 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్‌ నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని