Hyderabad: నాలాల వద్ద అక్రమ నిర్మాణాలపై త్వరలో నిర్ణయం: మంత్రి తలసాని

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు.

Updated : 22 Jul 2023 14:31 IST

హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను మంత్రి ఇవాళ పరిశీలించారు. హుస్సేన్‌ సాగర్‌ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని.. వాటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అవసరమైతే నష్టపరిహారం కూడా ఇస్తామని తెలిపారు.

నగరంలో నాలాలు అభివృద్ధి చేయడం వల్ల పలు ఇబ్బందులు తప్పాయని మంత్రి వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని