Talasani: హైదరాబాద్‌లో ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుంది: తలసాని

గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ముంపు ప్రభావం లేకుండా చేస్తామని చెప్పారు.

Published : 01 Jun 2022 15:48 IST

హైదరాబాద్‌: గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ముంపు ప్రభావం లేకుండా చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మరో మంత్రి మహమూద్ అలీ, మేయర్‌ విజయలక్ష్మితో కలిసి పట్టణ ప్రగతిపై తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపైనే పట్టణ ప్రగతిలో ఎక్కువగా దృష్టి సారించామని చెప్పారు.

మున్సిపల్‌శాఖ మంత్రిగా కేటీఆర్‌ వచ్చిన తర్వాత నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం దొరికిందని తలసాని చెప్పారు. పట్టణ ప్రగతి విజయవంతానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం కింద హైదరాబాద్‌లో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ మేయర్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని