Monkey pox: మంకీపాక్స్‌ ప్రమాదకరమా..? రాకుండా ఏం చేయాలి..!

మంకీపాక్స్‌ భయానికి గురి చేస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే ఇది కరోనా వైరస్‌లా ప్రమాదకరమా..? ప్రాణాంతకంగా మారుతుందా..? అంటే మాత్రం కాస్త ఊరట ఇచ్చే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 28 Jul 2022 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంకీపాక్స్‌ భయానికి గురి చేస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే, ఇది కరోనా వైరస్‌లా ప్రమాదకరమా..? ప్రాణాంతకంగా మారుతుందా..? అంటే మాత్రం కాస్త ఊరట ఇచ్చే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది శారీరకంగా, వ్యక్తిగతంగా కలిసినపుడే సోకుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ తీవ్రత, నివారణ మార్గాలను జనరల్‌ ఫిజిషియన్‌ శంకర్‌ప్రసాద్‌ వివరించారు.

లక్షణాలు ఇలా ఉంటాయి..

* ఇది ఎలుక, ఉడుత,కోతి లాంటి వాటితో కలిసి ఉంటే సోకుతుంది. శారీరక సంబంధం కలిగి ఉన్నట్లయితే 4-21 రోజుల తర్వాత జ్వరంతో మొదలవుతుంది.

* మంకీపాక్స్‌ సోకిన తర్వాత జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి ఉంటుంది. తర్వాత దురద, నొప్పితో కూడిన దద్దుర్లు, మశూచిలాంటి బొబ్బలు వస్తాయి.

* ముందుగా చర్మం కందినట్టు అవుతుంది. తర్వాత పొక్కులు వస్తాయి. అవి బొబ్బలై ఎండిపోయి ఊడిపోతాయి. రోగి రెండువారాల్లోనే కోలుకుంటారు. కొందరికి మాత్రమే ప్రాణాంతకంగా మారుతుంది.

* ఎక్కువగా మొహం, అరచేతులు, కాళ్లలో బొబ్బలు వస్తాయి. అందులో నుంచి నీరు కారుతుంది. స్వలింగసంపర్కుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 

*  మనిషిని మనిషి తాకినపుడు మాత్రమే విస్తరించే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నపుడు ఈ వైరస్‌ సోకడం చాలా కష్టం. చర్మం పగుళ్లు, కళ్లు, శ్వాసకోశ వ్యవస్థ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినవారు వారు ఐసోలేషన్‌ కావాలి. లేకపోతే ఇతరులకు వ్యాపిస్తుంది. 

* పీసీఆర్‌, రక్తపరీక్షతో వ్యాధిని గుర్తించవచ్చు. క్యాన్సర్‌, మధుమేహులు, చిన్న పిల్లలకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్మాల్‌పాక్స్‌తో వచ్చే ఇబ్బందులు వీరికి వస్తాయి.

* మంకీపాక్స్‌ కూడా చికెన్‌పాక్స్‌లాగే నాలుగువారాల్లో తగ్గిపోతుంది. మందుల అవసరం ఉండకపోవచ్చు. మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి. కళ్లద్దాలు పెట్టుకోవాలి. సెల్ఫ్‌ఐసోలేషన్‌లో ఉండాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని