Avinash Reddy: ఏడు గంటలపాటు సాగిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు ఆయన్ను ప్రశ్నించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఇవాళ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. అవినాష్ రెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన సీబీఐ.. రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శనివారం (3న) సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్, విడుదల జరిగాయి. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ ఇవాళ విచారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral Video: పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి నిజం తెలియడంతో..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు