Health: ముక్కులో పాలిప్స్‌ ఉంటే ఆపరేషన్‌ తప్పదు

ముక్కు బిగదీసుకొని పోవడం ఆపై ఊపిరి సరిగా ఆడకుండా పోవడంతో ఇబ్బందులు ఎందుకొస్తాయో తెలుసా...? ముక్కులో కండ పెరిగితే ఈ సమస్యలన్నీ వస్తాయి.

Updated : 02 Nov 2022 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముక్కు బిగదీసుకోవడం ఆపై ఊపిరి సరిగా ఆడకుండా పోవడం వంటి ఇబ్బందులు ఎందుకొస్తాయో తెలుసా...? ముక్కులో కండ పెరిగితే ఈ సమస్యలన్నీ వస్తాయి. జలుబు చేస్తే శ్వాస ఆడక ఇబ్బంది పడొచ్చు..కానీ, కొంతమందికి జలుబు చేయకపోయినా శ్వాస ఆడక సతమతమవుతారు. ముక్కులో కండ పెరగడానికి గల కారణాలు పరిష్కార మార్గాలను ఈఎన్‌టీ సర్జన్‌ జానకి రామిరెడ్డి సూచించారు.

* పాలిప్స్‌ వ్యాధితో ముక్కులో కండ పెరుగుతుంది. కొన్ని రకాల కణతులు కూడా ముక్కులో తయారవుతాయి. 

* నాసిల్‌ పాలిప్స్‌కు తప్పనిసరిగా ఆపరేషన్‌కు వెళ్లాలా అంటే..? అవుననే సమాధానం వస్తుంది. 

* గ్రేడ్‌-4 పాలిప్స్‌ అయితే ఆపరేషన్‌ చేయక తప్పదు. గ్రేడ్‌2,3 పాలిప్స్‌ అయితే మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవడం చాలా మంచింది.

* కొన్ని రకాల అలర్జీలున్నా కూడా పాలిప్స్‌ వస్తాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని