Hyderabad : ఓయూలో ఆన్‌లైన్‌ తరగతుల కొనసాగింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 12 వరకు బోధన సిబ్బంది ఆన్‌లైన్‌లోనే తరగతులు

Published : 31 Jan 2022 17:06 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 12 వరకు బోధన సిబ్బంది ఆన్‌లైన్‌లోనే తరగతులు బోధించాలని తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గుతున్నందువల్ల రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలను యథావిధిగా నడపాలని ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.కానీ, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచు ఓయూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ క్లాసులు : జేఎన్‌టీయూహెచ్‌

మరోవైపు ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో మొదటి, రెండు సంవత్సరాలకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని