APGEA: ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఆపాలి: ఆస్కార్‌రావు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులపై వేధింపులు ఆపాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ రావు కోరారు.

Published : 04 Jun 2023 22:43 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులపై వేధింపులు ఆపాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ రావు కోరారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ఆచూకీ కోసమంటూ 3 రోజులుగా పోలీసులు ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి ఆరా తీయటం సరికాదన్నారు. సూర్యనారాయణ గురించి 3 రోజులుగా తమకు సమాచారం లేదన్నారు. తమకు సంబంధం లేకపోయినా పోలీసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. సూర్యనారాయణను పోలీసులు పట్టుకోవాలంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

విజయవాడలోని వాణిజ్యపన్నుల శాఖ ఒకటో డివిజన్‌లోని నలుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈఎస్‌ఐకు చెందిన పన్ను వసూళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నమోదు చేసిన అధికారులు.. నలుగురు ఉద్యోగులు మెహర్‌, సంధ్య, సత్యనారాయణ, చలపతిరావులను అరెస్టు చేశారు. రూ.200 కోట్ల మేర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండికొట్టారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని