Pawan kalyan: జనసేనానిపై ‘ది రియల్‌ యోగి’ పుస్తకం.. ఆవిష్కరించిన నాగబాబు

గణ అనే రచయిత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ పుస్తకం రాశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నేత నాగబాబు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Updated : 17 Dec 2022 18:22 IST

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్‌ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. జనసేన నేత, పవన్‌ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్‌ కల్యాణ్ తెదేపా, భాజపాలో చేరితే మంత్రి పదవి వచ్చేది. పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టాడు. లంచగొండి, అవినీతిపరులను నిలదీయడానికి పవన్‌ పార్టీ పెట్టాడు. రాజకీయ నాయకుడైతే కోట్లాది మందికి సహాయం చేయగలనని భావించాడు. పవన్‌ మా ఇంట్లో పుట్టాడు కాబట్టీ అతని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నా’’ అని నాగబాబు అన్నారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘‘ పవన్‌ కల్యాణ్‌కు భక్తులు ఎక్కువ. ఆయనపై గణ రాసిన ‘ది రియల్‌ యోగి’ పుస్తకం చాలా బాగుంది. పవన్‌ కొంత మందికి చల్లగాలి.. మరి కొంతమందికి పిల్లగాలి’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని