చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 20 Apr 2024 15:42 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా చంద్రబాబుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు.అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతం ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన నేత అని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

రాజకీయంగా, పరిపాలనా పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని జనసేన అధినేత పవన్‌ కొనియాడారు. ‘నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచిస్తారు. వైకాపా పెట్టిన కేసులతో జైల్లో ఉన్నా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పవన్‌ తెలిపారు. 

అహర్నిశలు ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబునాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ఎక్స్‌లో పోస్టు చేశారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని