TTD: తిరుమలలో ఫిబ్రవరి 16న రథసప్తమి వేడుకలు

ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 

Published : 30 Jan 2024 17:21 IST

తిరుమల: ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

వాహన సేవల వివరాలు..

  • ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి  3 గంటల వరకు చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని