Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

తిరుమల(Tirumala)లో రథసప్తమి (Rathasapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Updated : 16 Feb 2024 07:56 IST

తిరుమల: తిరుమల(Tirumala)లో రథసప్తమి (Rathasapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. రాత్రి వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. 11-12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, 2-3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. 

సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. వేడుకల నేపథ్యంలో మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించారు. భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను తితిదే నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు