TSRTC: వీఆర్‌ఎస్‌కు ఎవర్నీ బలవంతం చేయట్లేదు: సజ్జనార్‌

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ఉద్యోగులెవర్నీ బలవంతం చేయట్లేదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఉద్యోగుల వీఆర్‌ఎస్‌ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని చెప్పారు.

Updated : 30 Mar 2022 15:25 IST

హైదరాబాద్‌: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ఉద్యోగులెవర్నీ బలవంతం చేయట్లేదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఉద్యోగుల వీఆర్‌ఎస్‌ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. వీఆర్‌ఎస్‌కు ఇప్పటికే 2వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్‌ తెలిపారు. వీఆర్‌ఎస్‌ అంశం తేలాక ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తామని చెప్పారు.

మరోవైపు ఉప్పల్‌ నుంచి యాదాద్రికి మినీ బస్సు సర్వీసులను టీఎస్ఆ‌ర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. టికెట్‌ ధర జేబీఎస్‌ నుంచి రూ.100, ఉప్పల్‌ నుంచి రూ.75గా నిర్ణయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని