WhatsApp: వాట్సాప్‌లో ‘న్యూఇయర్‌’ గిఫ్ట్‌.. నిజమెంత?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో న్యూఇయర్‌ గిఫ్ట్‌ పేరిట లింక్‌లు వస్తున్నాయి. మరి ఇందులో..

Published : 01 Jan 2022 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఏడాది వేళ సైబర్‌ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. న్యూఇయర్‌ గిఫ్ట్‌ పేరిట లింక్‌లు పెట్టి వ్యక్తిగత, బ్యాంక్‌ వివరాల చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ తరహా మెసేజులు వాట్సాప్‌లో ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లింక్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోసం చేసెదిలా..?

వాట్సాప్‌లో నడుస్తున్న కొత్త స్కామ్‌ పేరు Rediroff.ru. దీని ద్వారా కొత్త ఏడాదిలో ఖరీదైన బహుమతులంటూ ముందుగా వాట్సాప్‌లో లింక్‌లు వస్తున్నాయి. ఈ లింక్‌ ఓపెన్‌ చేయగానే ఓ చిన్న సర్వే నిర్వహించి బహుమతి కోసం సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త వెబ్‌పేజీకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీతో పాటు బ్యాంక్‌ వివరాలను నమోదు చేయమని చెప్పి.. మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేస్తారు. లేదంటే సమాచారాన్ని దొంగలిస్తారు. వీటితో పాటే పలువురు దుండగులు ‘Excuse me, who are you’, ‘I found you on my contact list’ అంటూ మెసేజ్‌లు పెట్టి స్కామ్‌లు చేస్తున్నారు.

ఇవి గుర్తుంచుకోండి..

* అపరిచిత వ్యక్తుల నుంచి ఇటువంటి లింక్‌లు వస్తే ముందుగా అది స్కామ్‌ అని అర్థం చేసుకోండి.
* ఈ లింక్‌లు క్లిక్‌ చేయడం ద్వారా రిమోట్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ అయ్యే ప్రమాదం ఉంది.
* తద్వారా మీ డేటాను దుండగులు ఈజీగా యాక్సెస్‌ చేస్తారు.
* మరీ ముఖ్యంగా మీకు వచ్చిన లింక్‌ ఓసారి గమనించండి. ఆ లింక్‌ URLలో.ru అని ఉంటే ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తిని వెంటనే బ్లాక్‌ చేయండి. లింక్‌ను క్లిక్‌ చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని