Secunderabad Bonalu: ఉజ్జయిని మహాకాళి బోనాలు.. తొలి బోనం సమర్పించిన తలసాని

అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి.

Updated : 09 Jul 2023 13:42 IST

సికింద్రాబాద్‌: అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తలసాని తెలిపారు.

బోనం సమర్పించిన కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి సికింద్రాబాద్‌ మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంగళ వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. వందల ఏళ్లుగా బోనాల పండగ పరంపర కొనసాగుతోందని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి అన్నారు. జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున దర్శనానికి వస్తున్నారని అన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. నీతి నిజాయితితో పాలన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని