Vizianagaram: పుదుచ్చేరి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

పుదుచ్చేరి నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. దీంతో విజయనగరం జిల్లా జామి మండలం అలమండ వద్ద రైలు అరగంట పాటు నిలిచిపోయింది.

Updated : 16 Nov 2023 13:03 IST

జామి: పుదుచ్చేరి నుంచి హావ్‌డా వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. దీంతో రైలు అరగంట పాటు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా అలమండ సమీపంలోని భీమసింగి వంతెన పైనుంచి రైలు వెళ్తోంది. అదే సమయంలో ఓ ఏసీ బోగీ వద్ద పొగలు వచ్చాయి. వంతెన పక్కనే ఉన్న పొలాల్లో ఉన్న పశువుల కాపరి పద్మనాభం ఈ విషయాన్ని గమనించి రైలులోని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు ఆగింది. ఆ తర్వాత రైల్వే గార్డు పరిశీలించి బ్రేక్‌ బైండింగ్‌ (బ్రేక్‌ వేసినప్పుడు వేడి పెరిగి పొగలు రావడం)గా గుర్తించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో రైలు మళ్లీ హావ్‌డా వైపు బయల్దేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని