Yadadri: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన: బాలాలయం నుంచి శోభాయాత్ర.. పాల్గొన్న కేసీఆర్‌

యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా బాలాలయంలో

Updated : 28 Mar 2022 12:03 IST

యాదగిరిగుట్ట: యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నేటితో పూర్తయింది. అనంతరం బంగారు కవచ మూర్తులతో బాలాలయం నుంచి ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. 

శోభాయాత్ర పూర్తయిన తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేపట్టనున్నారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది.  సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని