Soft Tissue: గడ్డే కదాని వదిలేయకండి...అది క్యాన్సర్‌ కావొచ్చు జాగ్రత్త..!

మన శరీరంలో ఎక్కడయినా క్యాన్సర్‌ ఆనవాళ్లు ఉంటే వణికిపోతాం. అలాంటిది అవయవాల్లో కాకుండా కండర కణజాలం, లిగ్‌మెంట్లు, రక్తనాళాల్లో క్యాన్సర్‌ వస్తే తొందరగా గుర్తు పట్టలేం..కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో వచ్చే ఈ క్యాన్సర్లను సాఫ్ట్‌ టిష్యూ సర్కోమాగా వైద్యులు చెబుతారు.

Published : 21 Aug 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన శరీరంలో ఎక్కడయినా క్యాన్సర్‌ ఆనవాళ్లు ఉంటే వణికిపోతాం. అలాంటిది అవయవాల్లో కాకుండా కండర కణజాలం, లిగ్‌మెంట్లు, రక్తనాళాల్లో క్యాన్సర్‌ వస్తే తొందరగా గుర్తు పట్టలేం..కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో వచ్చే ఈ క్యాన్సర్లను సాఫ్ట్‌ టిష్యూ సర్కోమాగా వైద్యులు చెబుతారు. ఈ క్యాన్సర్‌ గురించి సర్జికల్‌ అంకాలజిస్టు డాక్టర్‌ విక్రాంత్‌ ముమ్మనేని పలు విషయాలు తెలిపారు.

ఎక్కడ కనిపిస్తుంది..

ఎముకలు, పేగుల చుట్టూ కనెక్టీవ్‌ టిష్యూ సిస్టం ఉంటుంది.  ఇందులో కండరాలు, ఎముకల పక్కనుండే లిగ్‌మెంట్లు, టెండాన్స్‌, కొవ్వు, రక్తనాళాలు, నరాలుంటాయి. వీటిలో వచ్చే క్యాన్సర్లకు ప్రత్యేక కారణాలుండవు. కండరాల్లో చిన్న గడ్డలుగా వస్తాయి. పెద్దగా నొప్పి ఉండదు. అందుకే రోగులు గుర్తించరు. సెగ్గడ్డలుగా భావిస్తారు. కానీ ఇది కండరాలు, నరాలను తినేస్తుంది. తొలి దశలో దీన్ని పూర్తిగా నివారించవచ్చు. ఊపిరితిత్తుల్లోకి చేరిన తర్వాత నివారణ సాధ్యం కాదు. పెట్‌స్కాన్‌ చేసినపుడే క్యాన్సర్‌ను గుర్తించడానికి వీలవుతుంది.

చికిత్స ఎలా ఉంటుంది

గడ్డ ఏ స్థాయిలో ఉందో దాని ఆధారంగా చికిత్స ఉంటుంది. ఆపరేషన్‌ తర్వాత రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల దాకా వెళ్లినట్లయితే కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించినట్లయితేనే నివారణ సాధ్యం అవుతుంది. లేకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని