TTD: శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు ఆన్‌లైన్‌లో 16న విడుదల

హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో ఈనెల 23 నుంచి శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం నిర్వహించాలని తితిదే బోర్డు నిర్ణయించింది.

Updated : 15 Nov 2023 19:07 IST

తిరుమల: హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో ఈనెల 23 నుంచి శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం 16న మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను తితిదే విడుదల చేయనుంది. టికెట్‌ ధర రూ.1000లుగా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారని అధికారులు తెలిపారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తితిదే అధికారులు తెలిపారు. హోమం ఏర్పాట్లను బుధవారం జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. హోమం నిర్వహణకు, భక్తులు కూర్చునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు