పైపులైన్‌ లీకేజీ.. కొట్టుకుపోయిన వేరుశనగ పంట

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం పాపంపల్లి గ్రామం వద్ద వెంకటేశులు అనే రైతు పొలంలో శ్రీరామిరెడ్డి నీటి పథకం పైపులైన్‌ పగిలింది.

Updated : 13 Sep 2023 16:01 IST

కళ్యాణదుర్గం గ్రామీణం: అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం పాపంపల్లి గ్రామం వద్ద వెంకటేశులు అనే రైతు పొలంలో శ్రీరామిరెడ్డి నీటి పథకం పైపులైన్‌ పగిలింది. దీంతో ఎకరా వేరుశనగ పంట నీటిలో కొట్టుకుని పోయింది. సుమారు రూ.30 వేల వరకు పంటనష్టం జరిగిందని బాధిత రైతు తెలిపారు. పైపులైన్‌ మరమ్మతుకు పక్కనే ఉన్న గేట్‌వాల్‌ తెరవడంతో నీరంతా ఒక్కసారిగా పైకి ఎగసిపడి పౌంటెయిన్‌ను తలపించింది. శాశ్వత పైపు లైన్‌ను ఏర్పాటు చేసి నీళ్ల లీకేజీని అరికట్టాలని ఈ సందర్భంగా రైతులు అధికారులను కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని