Wearable AC: సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్‌ను తీసుకొచ్చింది.
హాంకాంగ్: సోనీ మరో కొత్త స్మార్ట్ గ్యాడ్జెట్‌ను ఇటీవల విడుదల చేసింది. ధరించగలిగే చిన్న ఏసీ (Wearable Air Conditioner) డివైజ్‌ను తీసుకొచ్చింది. మెడపై తగిలించుకొని ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లొచ్చు. ఇది చలి, వేసవి కాలాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. రియాన్ పాకెట్-5 పేరిట దీన్ని ప్రవేశ పెట్టింది.
రియాన్ పాకెట్‌ను ఆన్ చేయగానే అది మన శరీర, పరిసరాల ఉష్ణోగ్రతను సరిపోలుస్తుంది. ఆటోమేటిక్‌గా కూలింగ్ లేదా వార్మింగ్ టెంపరేచర్‌ను సెట్ చేస్తుంది. ప్రత్యేకంగా మనం నియంత్రించాల్సిన అవసరమేమీ ఉండదు. మన కదలికలకు బట్టి అక్కడి పరిసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మారుస్తుంది. కావాలనుకుంటే మొబైల్ యాప్‌లో ప్రత్యేకంగా కమాండ్స్ ఇచ్చే ఫీచర్ కూడా ఉంది.
ఈ డివైజ్‌ను ప్రత్యేకంగా ఆన్/ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మెడపై పెట్టుకోగానే పనిచేయడం ప్రారంభిస్తుంది. తీసి పక్కనపెడితే ఆగిపోతుంది. ఉష్ణోగ్రత, తేమ, కదలికలను పసిగట్టడం కోసం రియాన్ పాకెట్లో మొత్తం ఐదు సెన్సర్లు ఉంటాయి. దీనితో పాటు ఒక పాకెట్ ట్యాగ్‌ను కూడా ఇస్తారు. దాన్ని ముందు జేబులో వేసుకుంటే చాలు. పరిసరాల్లో ఉష్ణోగ్రతను గుర్తించి రియాన్ పాకెట్‌కు చేరవేస్తుంది. ట్యాగ్ లేకున్నా ఈ డివైజ్ పనిచేస్తుంది. అది కేవలం ఉష్ణోగ్రతను మరింత కచ్చితత్వంతో అంచనా వేయడానికి మాత్రమే.
ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ గరిష్ఠంగా 17 గంటలు. ధర 1,499 హాంకాంగ్ డాలర్లు. ప్రస్తుతానికి ఇది భారత్‌లో అందుబాటులో లేదు. నిజానికి దీన్ని సోనీ 2019లోనే తీసుకొచ్చింది. క్రమంగా అప్డేటెడ్ వెర్షన్లను విడుదల చేస్తోంది. అయితే, తీసుకొచ్చిన ప్రతిసారీ కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోంది. తాజా రియాన్ పాకెట్-5ను ఐరోపాలో విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
12GB ర్యామ్‌తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్‌గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్‌తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపింది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్‌జీపీటీ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్‌ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ప్రయోజనాలు సహా పూర్తి వివరాలు చూద్దాం... -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్‌ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
గూగుల్, యాపిల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్‌ను తీసుకురానుంది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్‌తో అమెజాన్ 4K ఫైర్‌స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్‌ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్‌తో ఇది వస్తోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్‌బడ్స్‌ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్‌లో విడుదలైంది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్‌ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్‌స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్‌లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది. -
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్‌లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!