Varla Ramaiah: చంద్రబాబు.. పవన్‌పై రాళ్ల దాడి.. గవర్నర్‌కు కూటమి నేతల ఫిర్యాదు

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి యత్నం ఘటనలపై కూటమి నేతలు గవర్నర్‌కు అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated : 15 Apr 2024 19:02 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి యత్నం ఘటనలపై కూటమి నేతలు గవర్నర్‌కు అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. సిట్‌ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనం ఘటనను కూడా ఫిర్యాదులో ఉటంకించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, షరీఫ్‌ తదితరులున్నారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై రాయి దాడి ఓ డ్రామా అని అన్నారు. ఆ డ్రామా విఫలమైందని వైకాపా నేతలకూ తెలుసన్నారు. ఈ ఘటనలపై విజయవాడ సీపీతో కాదు.. సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘‘ చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలన్నీ తగలబెట్టారు. ఈ ఘటనలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సిట్‌ అధిపతి రాఘురామ్‌ రెడ్డి పాత్ర ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు. సీఎస్‌ను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరాం. మేం చెప్పిన విషయాలపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు’’ అని వర్ల రామయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని