Telangana Group-1: గ్రూప్‌-1 ప్రిలిమినరీ తుది మాస్టర్‌ కీ విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది మాస్టర్‌ ‘కీ’ విడుదలైంది. తుది మాస్టర్‌ కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Published : 16 Nov 2022 01:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది మాస్టర్‌ ‘కీ’ విడుదలైంది. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో తుది మాస్టర్‌ ‘కీ’ అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ అక్టోబరు 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్‌ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు.

కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్‌ తాజాగా తుది మాస్టర్‌ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్‌ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చిని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. 503 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా..2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని