Ts News: ఎరువుల ధరలు తగ్గే వరకు ఆందోళనలు కొనసాగుతాయి: ఎర్రబెల్లి దయాకర్‌

కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.

Published : 13 Jan 2022 14:55 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎరువుల ధరల పెంపును సమర్థించుకునేలా భాజపా నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరి 5 ఏళ్లయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై పోరాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో ఆయా పార్టీలు వివరాలు ఇచ్చిన తర్వాత.. చర్చలు పెట్టుకుందామని ఎర్రబెల్లి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని