Telangana TET: తెలంగాణ టెట్‌ రాసేందుకు వాళ్లూ అర్హులే: కన్వీనర్‌ రాధారెడ్డి

ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తి సమాచార బులెటిన్‌, సిలబస్‌ను విడుదల చేసినట్లు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.

Updated : 25 Mar 2022 15:30 IST

హైదరాబాద్: ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తి సమాచార బులెటిన్‌, సిలబస్‌ను విడుదల చేసినట్లు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈసారి బీఈడీ, డీఎల్ఈడీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పేపర్‌-1 లేదా పేపర్‌-2 లేదా రెండింటికీ కలిపి రుసుము రూ.300గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్‌ 12న టెట్‌ పరీక్ష జరుగుతుంది. జూన్‌ 27న ఫలితాలు వెల్లడిస్తారు. టెట్‌కు సంబంధించి మార్చి 26 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ రాధారెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని