Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tejas Aircraft: వాయుసేన చేతికి తొలి తేజస్ ట్విన్ సీటర్ విమానం
-
Kiran Abbavaram: రతిక లాంటి భార్య.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే..?
-
Nara Lokesh: అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ