AP News: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Updated : 10 Dec 2021 22:59 IST

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. అంతకుముందు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గానూ పనిచేశారు. యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ సోదాలు కొనసాగుతున్న సమయంలో లక్ష్మీనారాయణ అధిక రక్తపోటు వల్ల కళ్లు తిరిగి పడిపోయారు. ఇంటికి వచ్చి పరిశీలించిన ఫ్యామిలీ డాక్టర్‌ .. ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని లక్ష్మీనారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని