Hyderabad Metro: రేపట్నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పులు

హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపట్నుంచి మార్పులు జరగనున్నాయి.

Updated : 05 Sep 2021 10:34 IST

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపట్నుంచి మార్పులు జరగనున్నాయి. చివరి మెట్రో సర్వీస్‌ సమయాన్ని అరగంట పొడిగించారు. రాత్రి 10.15 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీస్‌ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రో సర్వీస్‌ను అరగంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఎప్పటి మాదిరే ఉ.7 గంటల నుంచి మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని