Updated : 04 Dec 2021 08:49 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-12-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

తలచిన కార్యాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

మీమీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకూలిస్తుంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీ దేవి సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

గ్రహబలం తక్కువగా ఉంది.  శ్రమ కాస్త పెరుగుతుంది. మితంగా ఖర్చుచేయాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మంచి భోజనం తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాన్ని  చదవాలి.

అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. శని ధ్యానం చేయండి.

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.

మిమి రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మిమి రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి . ఒక శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహ్రుదయము పఠించడం మంచిది.

 

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారములు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.  

భవిష్యత్ ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తోటివారితో వాదోపవాదాలు చేయకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని