AP News: పరవాడలో బోల్తాపడిన ట్యాంకర్‌ నుంచి గ్యాస్ లీక్‌

పరవాడలో బోల్తాపడిన ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. ట్యాంకర్‌ను క్రేన్‌

Updated : 27 Dec 2021 16:15 IST

పరవాడ: పరవాడ మండలం ఫార్మాసిటీకి సమీపంలో ఉన్న ప్యాడి ఐవోసీఎల్‌ ఎల్పీజీ గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ వద్ద సోమవారం ఉదయం గ్యాస్‌ లోడ్‌తో ఉన్న ట్యాంకర్‌ లారీ బోల్తాపడింది. విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి సుమారు 17.5 టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను లోడ్‌ చేసుకొని ప్యాడి ఐవోసీఎల్‌ ప్లాంట్‌కు చేరుకొంది. ఆ సమయంలో ప్లాంట్‌లో లారీలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులు లారీని బయటే నిలపాలని చెప్పారు. దీంతో డ్రైవర్‌ కుమార్‌ లారీని రోడ్డు పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి బోల్తాడింది. సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ క్రేన్‌ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగిస్తుండగా ట్యాంకర్‌నుంచి గ్యాస్‌ లీకవడంతో కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. గ్యాస్‌ లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని