HYD: రహదారులు దిగ్బంధం..ముంపులో ప్రజలు.. జంట జలాశయాలకు భారీ వరద

నగరంలో నిన్న రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరణుడు సృష్టించిన బీభత్సానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 09 Oct 2021 10:34 IST

హైదరాబాద్‌: నగరంలో నిన్న రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరణుడు సృష్టించిన బీభత్సానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రహదారులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఈ ఉదయానికి చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం గుంతపల్లి నుంచి మజీద్ పుర్‌కి వెళ్లే దారిలోని వాగులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. నగరంలోని చంపాపేట్‌ రెడ్డి కాలనీ సరూర్ నగర్, కోదండరాం నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి జంట జలాశయాలకు వరద పోటెత్తింది.

హైదరాబాద్‌- బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరాంఘర్‌- శంషాబాద్‌ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని