బిల్‌గేట్స్ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు చూస్తారా..!
వారాంతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇల్లు పెళ్లి వేడుకలతో కళకళలాడింది. శనివారం బిల్, మిలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ క్యాథరీన్ వివాహ వేడుక జరిగింది.
వాషింగ్టన్: వారాంతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇల్లు పెళ్లి వేడుకలతో కళకళలాడింది. శనివారం బిల్, మిలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ క్యాథరీన్ వివాహ వేడుక జరిగింది. ఆమె ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ నాయెల్ నాజర్‌ను వివాహం చేసుకున్నారు. న్యూయార్క్‌లోని గేట్స్ కుటుంబానికి చెందిన ఫార్మ్‌హౌస్ ఈ వేడుకకు వేదికైంది. ఇప్పుడు నెట్టింట్లో దర్శనమిచ్చిన ఆ జంట ఫొటోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
జెన్నిఫర్, నాయెల్ స్టాన్‌ఫోర్డ్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 2017లో ఈక్వెస్ట్రియన్ సర్క్యూట్లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. ప్రేమలో పడ్డారు. గత సంవత్సరం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాయెల్ ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడిన సంగతి తెలిసిందే. బిల్, మిలిందా గేట్స్ తమ ట్విటర్ ఖాతాల్లో వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్‌పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ