TS News: తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తి: హరీశ్‌రావు

తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Updated : 28 Dec 2021 19:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వంద శాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు. వ్యాక్సినేషన్‌పై మొదటి నుంచి సీఎం ప్రత్యేక దృష్టి సారించి.. స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని చెప్పారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖలు వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యమయ్యాయని వివరించారు. ‘‘టీకాపై  ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశాం. 18 ఏళ్లు దాటిన వారిని వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేశాం. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి.  కరోనా విపత్తు వేళ వ్యాక్సిన్‌ సంజీవనిగా నిలిచింది.  రాష్ట్రంలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలి’’ అని హరీశ్‌రావు వెల్లడించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని