Omicron: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు..

తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు

Updated : 22 Dec 2021 19:03 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపారు.  ప్రస్తుతం ఆ వ్యక్తిని గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. తాజా కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కి చేరుకుంది.

హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు నమోదవడంతో వైద్యఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యాధికారిణి నాగజ్యోతి తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

కాలనీ వాసులందరికీ ర్యాపిడ్‌ టెస్టులు: కార్పొరేటర్‌ నవజీవన్‌రెడ్డి

హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో మొదటి ఒమిక్రాన్‌ కేసు నమోదైందని స్థానిక కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌రెడ్డి తెలిపారు. సూడాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ బారిన పడ్డారని వెల్లడించారు. ముందుజాగ్రత్తగా కాలనీ వాసులందరికీ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. కాలనీ పరిసరాల్లో శానిటేషన్ చేయించామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని