Telangana High Court: జీవో ఉద్దేశమేంటి?రాసిందేంటి?

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58కోట్లు కేటాయించడంపై తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హైకోర్టుకు వివరణ ఇచ్చారు.

Updated : 05 Aug 2021 13:07 IST

తెలంగాణ సీఎస్‌ను ప్రశ్నించిన హైకోర్టు
ఆ నిధులు భూసేకరణ పరిహారం చెల్లింపునకు అని సీఎస్‌ వివరణ

హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58కోట్లు కేటాయించడంపై తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఆ నిధులు కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని.. ఆ కేసుల్లో భూ సేకరణ పరిహారం చెల్లింపునకు అని సీఎస్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్ (ఏజీ) ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ కోర్టును తప్పుదోవ పట్టించారని సోమేశ్‌కుమార్‌ ఆ వివరణలో పేర్కొన్నారు. నిధులు విడుదల చేయొద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని కోరారు. జీవో రాసిన తీరుపై ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్దేశం ఏమిటి? కాగితంపై రాసిందేంటని ప్రశ్నించింది. ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమే అన్నట్లుగానే జీవో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. జీవో ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా అని ఆక్షేపించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు