AP news: గ్రామానికి రోడ్డేయాలని కోరితే.. లాఠీలతో చితకబాదారు

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గ్రామస్థులు ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు.

Published : 30 Aug 2021 01:20 IST


నిడమర్రు: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గ్రామస్థులు ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను నిడమర్రు పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలకు పనిచెప్పి పాదయాత్ర చేస్తున్నవారిని చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేసి నిడమర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అడవికొలను గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేయాలని శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. పోలీసులు లాఠీలతో చితకబాదడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని