TTD: తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో జవహర్‌రెడ్డి

తిరుపతి- తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని తితిదే ఈవో జవహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల

Updated : 01 Dec 2021 16:47 IST

తిరుమల: తిరుపతి- తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని తితిదే ఈవో జవహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండో ఘాట్‌రోడ్‌లో 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని.. వీటి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సాయంత్రం లోపు బండరాళ్లు, మట్టిని పూర్తిగా తొలగిస్తామని ఈవో తెలిపారు. మొదటి ఘాట్‌ రోడ్‌లో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని, సాయంత్రం 4గంటల వరకు తిరుపతి నుంచి తిరుమలకు 2,300 వాహనాలు, తిరుమల నుంచి తిరుపతికి 2వేల వాహనాలు ప్రయాణించాయని వివరించారు. చెన్నై ఐఐటీ ప్రొపెసర్లు తిరుమల చేరుకుని విరిగిపడిన కొండచరియలను పరిశీలించారని, దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు గురువారం ఘాట్‌రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. ఐఐటీ నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలించి సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని ఈవో వివరించారు. ఘాట్‌రోడ్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్‌, సెక్యూరిటీ, ఫారెస్టు, ఆరోగ్య, తదితర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఈవో ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని