Ap News: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద.. సముద్రంలోకి 1.36 లక్షల క్యూసెక్కుల నీరు

పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి    1,52,318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు..

Published : 12 Oct 2021 16:25 IST

విజయవాడ: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి    1,52,318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు దాదాపుగా 15,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మిగిలిన 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ క్రస్ట్ లెవల్ స్థాయికి మించి నీటి ప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి గడిచిన కొన్ని రోజులుగా నిత్యం సగటున 30వేల క్యూసెక్కుల వరకూ నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని