Pregnancy Care: గర్భం ధరించారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!

అమ్మ అవ్వడం ఓ వరం. అది ఆడవాళ్లకు మాత్రమ దక్కిన అదృష్టం. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకువస్తుంది.

Published : 18 Sep 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ కావడం ఓ వరం. అది ఆడవాళ్లకు మాత్రమే దక్కిన అదృష్టం. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకువస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. మొదటి రోజు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం రండి! 

కాఫీ, టీలకు కాస్త దూరంగా ఉండండి! 
కొంతమందికి కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు. కానీ గర్భం దాల్చిన సమయంలో వీటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే కెఫిన్‌  బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందట. 
 

వేడినీళ్ల స్నానం తగ్గించండి! 
బాగా మరిగిన వేడి నీటితో స్నానం చేయడం గర్భిణులకు అంత మంచిది కాదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. 
 

మద్యపానం, ధూమపానం చేయకూడదు. 
గర్భంతో ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం చేస్తే బిడ్ద మెదడు, అవయవాలు పెరిగే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 
 

ఒకే దగ్గర కూర్చోకూడదు..
ఎక్కువ సమయం పాటు ఒకే ప్రాంతంలో కూర్చోకూడదు. అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా శరీరానికి వ్యాయామంలా పని చేస్తుంది. 
 

హై హీల్స్‌ వద్దు!
బయటకు వెళ్లేటప్పుడు ఫ్లాట్‌గా ఉన్న చెప్పులను మాత్రమే ధరించాలి. హై హీల్స్ వేసుకోకూడదు. 
 

బరువులకు దూరం..
గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బరువులు మోయడం అసలు చేయకూడదు. ఇలా చేయడం తల్లి, బిడ్డకు ఎంతో ప్రమాదకరం. 


 

 చేయాల్సిన పనులు: 

* ఈ సమయంలో తల్లి ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. 
* తల్లి ప్రతి కదలికను బట్టి కడుపులో ఉన్న బిడ్డ స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 
* భయాందోళనలు కలిగించే దృశ్యాలు, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. 
* ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. 
* పుస్తకాలు చదువుతూ ఉండాలి. 

* శ్రావ్యంగా ఉండే సంగీతాన్ని వినాలి. 
* మంచి ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు. 
 

మొదటి రోజు నుంచి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ అందమైన, ఆరోగ్యమైన పాపాయికి ఇంటికి ఆహ్వానించండి. మీ జీవితంలో ఆనందాలను నింపుకోండి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని