CV Anand: సీవీ ఆనంద్‌ సహా ముగ్గురికి డీజీలుగా పదోన్నతి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో ముగ్గురు అదనపు డీజీలు... డీజీలుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 07 Aug 2023 17:34 IST

హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు అదనపు డీజీలు... డీజీలుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్, రాజీవ్ రతన్, జితేందర్‌లు డీజీలుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ హైదరాబాద్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జితేందర్ హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ విధులు నిర్వర్తిస్తున్నారు.

గత ఏడాది నవంబర్‌లో సీఐడీ డీజీ గోవింద్ సింగ్, డిసెంబర్‌లో మహేందర్ రెడ్డి, రెండు నెలల క్రితం ఉమేష్ పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మూడు డీజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా ఐదుగురు పోలీస్ ఉన్నతాధికారులు డీజీ హోదాలో ఉంటారు. గత కొన్ని నెలలుగా డీజీ పోస్టులు ఖాలీగా ఉండటంతో ప్రభుత్వం ముగ్గురికి డీజీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని